FbTelugu

ఆన్ లైన్ లోనే పాఠాలు: తొందరేమి లేదన్న కెసిఆర్

హైదరాబాద్: కరోనా మహమ్మారి దృష్ట్యా రాష్ట్రంలో విద్యా సంస్థలు జూలై 1 నుంచి ఆన్ లైన్ లో పాఠాలు బోధించాలని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనకు తొందరేమి లేదని, తరువాత చూద్దామని ఆయన తెలిపారు.

వెంటనే ఆన్ లైన్ క్లాసులకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులు 50 శాతం హాజరయ్యేలా చూడాలని సూచించారు. అంతకు ముందు సిఎం కెసిఆర్ ను ప్రగతి భవన్ లో పి.ఆర్.టి.యు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందచేశారు. పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టాలని కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.