FbTelugu

జనం రాళ్ల దాడిలో చిరుత మృతి

భువనేశ్వర్: తమపై దాడి చేసి ప్రాణాలు తీస్తుందనే భయంతో గ్రామస్థులు చిరుత ను తీవ్రంగా గాయపరిచారు. తీవ్ర గాయాలకు గురైన అది గ్రామంలోనే ప్రాణాలు కోల్పోయింది. సుందర్ ఘర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకున్నది.

బాద్ రాంపియా గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. అప్పుడప్పుడు గ్రామంలోని వన్యప్రాణులు ప్రవేశించడం, వాటిని గ్రామస్థులు తరిమేస్తారు. ఈ నెల 4వ తేదీన సాయంత్రం గ్రామంలోకి చిరుత ప్రవేశించింది. ఈ సమాచారం అందరికీ తెలిసిపోవడంతో అప్రమత్తమయ్యారు. ఏమాత్రం ఆలోచించకుండా కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలైంది. రక్తస్రావం కావడంతో ప్రాణాలు కోల్పోయింది. సమాచారం తెలిసిన వెంటనే గ్రామంలోకి చేరుకున్న అటవీ శాఖ అధికారులు చిరుత కళేబరాన్నిపోస్టుమార్టం పంపించారు.

You might also like