FbTelugu

రాజేంద్రనగర్ లో మళ్లీ చిరుత సంచారం

హైదరాబాద్: నగరశివారు రాజేంద్రనగర్ లో మరోసారి చిరుత తీవ్ర కలకలం సృష్టిస్తోంది. వ్యవసాయ యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

చిరుత ఓ ఇంటి కాంపౌండ్ లోకి వెళ్లింది. దీనికి సంబంధించి సీసీ టీవీ పుటేజీలో రికార్డయినట్టు తెలిపారు. దీంతో భయాందోళనకు గురైన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిపారు. గత రెండు వారాలుగా అటవీ శాఖాధికారులను చిరుత ముప్పు తిప్పలు పెడుతున్నది. దాన్ని బంధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం లేదు. సంచరించే ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు  చేసినప్పటికీ చిక్కడం లేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.