FbTelugu

కాటేదాన్ లో చిరుత కలకలం

రంగారెడ్డి: మైలార్ దేవుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై చిరుత కూర్చుని ఉండడంతో పలువురు భీతిల్లిపోయారు.

చిరుత దాడి చేస్తుందేమేనన్న భయంతో పలువురు దూరం నుంచి వెళ్లిపోయారు. అయితే కొందరు దాన్ని ఆసాంతం గమనించి, గాయాలు కావడంతో కదల్లేని స్థితిలో ఉందని అంచనా కు వచ్చారు. ఈ విషయాన్ని నెహ్రూ జూ పార్క్ అధికారులకు, మైలార్ దేవుపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకుని దాన్ని బంధించేందుకు సిద్ధమైనప్పటికీ అది అక్కడ కన్పించకుండా పోయింది.

నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తోందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఒక లారీ డ్రైవర్ పై దాడి చేసి పారిపోయింది.

You might also like