నల్లగొండ: పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిని మూడు నాలుగు గంటలుగా ముప్పు తిప్పలు పెట్టిన చిరుత ఎట్టకేలకు చిక్కింది. చిరుత చిక్కడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మర్రిగూడ మండలం రాజపేట తండా సమీపంలో ఇవాళ ఉదయం నుంచి రైతులు, పోలీసులు, అటవీ శాఖ సిబ్బందిని భయాందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. పోలానికి రక్షణ గా వేసిన వలలో చిరుత చిక్కుకోగా, పట్టుకునేందుకు అక్కడికి పోలీసులు చేరుకున్నారు. దాన్ని బంధించే క్రమంలో అటవీ సిబ్బంది పై దూకి గాయపరిచింది.
చుట్టూ జనం ఉండంతో పోలీసుల వాహనం కిందకు వెళ్లి దాక్కున్నది. మత్తు ఇచ్చి ప్రత్యేక బోనులో బందించి హైదరాబాద్ లోని నెహ్రూ జూ పార్క్ కు తరలించారు. చిరుత దాడిలో గాయపడిన వారిని హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం తరలించారు.