FbTelugu

వాకింగ్ కు వెళ్లిన వృద్ధురాలిపై చిరుత దాడి

చిరుత దాడి చేయడంలో వృద్ధురాలు మృతి చెందిన ఘటన కర్ణాటకలో ఇవాళ తెల్లవారుజామున చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. బెంగుళూరు సమీపంలోని స్థానిక తవరేకేరి పోలీసు స్టేషన్‌ పరిధిలో కొట్టగణహల్లి గ్రామానికి చెందిన గంగమ్మ(68) అనే వృద్దురాలు మార్నింగ్ వాక్ కు వెళ్లగా ఓ చిరుత ఆమెపై తీవ్రంగా దాడి చేసింది.

ఈ ఘటనలో వృద్ధురాలు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని చిరుత కోసం గాలింపు చేపట్టారు. అయితే కొద్ది రోజుల క్రితమే ఓ మూడేళ్ల బాలునిపై కూడా దాడి చేయడంతో బాలుడు మృతి చెందినట్టు తెలుస్తోంది.

You might also like