FbTelugu

టాయి లెట్ లో చిరుతపులి దాడి

షిమ్లా: టాయిలెట్ లోకి తెల్లవారు జామున వెళ్లిన ఒక యువకుడిపై చిరుత దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దాని దాడి నుంచి తప్పించుకునేందుకు యువకుడు అరుపులు, కేకలు వేయడంతో ఇంట్లో వారితో పాటు ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు.

దాని బారి నుంచి బయటపడి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లోని షిమ్లా నగరం కృష్ణ నగర్ లో గౌరవ్ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు టాయిలెట్ లో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అప్పటికే టాయిలెట్ లో దూరి ఉన్న చిరుతపులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. చిరుతను చూసి భయాందోళనకు గురైన గౌరవ్ గట్టిగా కేకలు వేశాడు. ఆ కేకలు ఉన్నవారు ఒక్క ఉదుటన అక్కడకు చేరుకుని దాని బారి నుంచి కాపాడి టాయి లెట్ లోనే బంధించారు. తీవ్రంగా గాయపడిన గౌరవ్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.