FbTelugu

నూతన రెవెన్యూ బిల్లుకు మండలి ఆమోదం

హైదరాబాద్‌: నూతన రెవెన్యూ బిల్లుకు శాసన మండలి ఇవాళ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్‌ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా, చర్చ తరువాత ఆమోదముద్ర వేశారు.

కొత్త రెవెన్యూ బిల్లుతో పాటు వీఆర్వో వ్యవస్థ రద్దు, తెలంగాణ పంచాయతీరాజ్‌ సవరణ తదితర బిల్లులకు కూడా శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. ఇటీవలే శాసనసభలో నూతన రెవెన్యూ బిల్లుతో పాటు మరికొన్ని బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.

You might also like