FbTelugu

జీవితాంతం వారికి ఫ్రీ గా సినిమాలు

పాట్నా: వారు అహోరాత్రులు దేశం కోసం సేవ చేస్తున్నారు. చలికి వణికి పోతు, ఎండకు ఎండుతూ, వానలకు తడుస్తూ విధులు నిర్వర్తిస్తున్న వారికి తన వంతుగా గౌరవం ఇవ్వాలని నిర్ణయించాడు ఒక సినిమా హాలు యజమాని. ఆయనే రెజెండ్ థియేటర్ యజమాని సుమన్ కె.సిన్హా.

ఆర్మీ, నేవీ, ఏయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్న సైనికులకు ఉచితంగా సినిమాలు చూపిస్తామని సుమన్ తెలిపారు. దేశ సేవలో ఉండే సైనికులకు వినోదం పంచడం నా బాధ్యతగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. సైనికులు థియేటర్ కు వచ్చి హాయిగా సినిమా చూసి వెళ్లొచ్చన్నారు. ఈ ఆఫర్ జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందన్నారు. పాట్నాలోని ధనాపూర్ రెజిమెంట్ లో సుమారు 1200 మంది సైనికులు ఉన్నారు. వీరితో పాటు వేలాది మంది సైనికకులు పదవీ విరమణ చేసిన వారు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.