FbTelugu

బెట్టింగ్ తో వేల కోట్ల రాబడి: కేంద్ర మంత్రి అనురాగ్

ముంబై: దేశంలో జరుగుతున్న బెట్టింగ్ ను చట్టబద్ధం చేస్తే ప్రభుత్వానికి వేల కోట్ల రాబడి వస్తుందని కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఆదాయం పెరగడంతో పాటు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి అనైతిక కార్యకలాపాలు అడ్డుకట్ట వేయవచ్చని అన్నారు.

ముంబై లో ఐసీఐసీఐ నిర్వహించిన సెక్యురిటీస్ సదస్సులో ఆయన మాట్లాడారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో బెట్టింగ్ కు చట్టబద్ధత ఉందని, దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నదని వివరించారు. చట్టబద్దం చేయడం మూలంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, మ్యాచ్ ఫిక్సింగ్ లు ఆగిపోతాయని, నేరాలు తగ్గిపోతాయని అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.