FbTelugu

బెంగాల్ లో 12 గంటల బంద్ కు పిలుపు

కొలకతా: న్యాయమైన డిమాండ్ల పై ఆందోళన చేసిన విద్యార్థులపై లాఠీఛార్జ్ కు నిరసనగా ఇవాళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు బంద్ కు పిలుపునిచ్చాయి.

ఉద్యోగాలు ఇప్పించాలంటూ శుక్రవారం నాడు వామపక్ష పార్టీలకు చెందిన విద్యార్థి సంఘాలు సచివాలయం వైపునకు దూసుకువెళ్ళే ప్రయత్నం చేశాయి. సచివాలయం వైపు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఈ ర్యాలీలో 150 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారని, అమానుషంగా కొట్టారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. దీనికి నిరసగా ఇవాళ 12 గంటల బంద్ కు పిలుపునిచ్చినట్లు తెలిపాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.