FbTelugu

లంచం కేసులో జైలు కెళ్లిన కిలాడీ ఎస్సై

అహ్మదాబాద్:అత్యాచార కేసు నిందితుడి నుంచి రూ.35 లక్షలు లంచం డిమాండ్ చేసిన మహిళా ఎస్సై గుట్టు రట్టయింది.
అహ్మదాబాద్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అహ్మదాబాద్ పశ్చిమ మహిళా పోలీసు స్టేషన్ ఎస్సై శ్వేతా జడేజా రేప్ కేసు నిందితుడు కేనాల్ షా ను రూ.35 లక్షలు డిమాండ్ చేసింది. అయితే రూ.20 లక్షలు ఇచ్చేందుకు నిందితుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ప్రకారంగానే రూ.20 లక్షలు చెల్లించాడు. అయినా ఎస్సై మిగతా రూ.15 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుపట్టడంతో ఆయన ఉన్నతాధికారులను ఆశ్రయించాడు.

డబ్బులు తీసుకుంటుండగా ఎస్సైను అరెస్టు చేశారు. ఆమె పై సంఘ వ్యతిరేక చర్యల చట్టం కింద కేసు నమోదు చేసి జిల్లా సెషన్స్ కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరగా మూడు రోజుల కస్టడీకి అనుమతించారు. షా క్రాప్ సొల్యుషన్ కంపెనీ యజమాని కేనాల్ షా తమపై అత్యాచారం చేశారంటూ ఇద్దరు మహిళలు పోలీసు స్టేషన్ లో కేసు పెట్టారు.
2019 లో ఎప్ఐఆర్ నమోదు కాగా, కేసు దర్యాప్తు చేపట్టిన శ్వేతా జడేజా నిందితులతో చేతులు కలిపింది. కేనాల్ షా సోదరుడు భవేష్ కు ఫోన్ చేసి రూ.35 లక్షలు డిమాండ్ చేసి, రూ.20 లక్షలకు ఓకే చెప్పింది. మధ్యవర్తి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.20 ఆమె స్వీకరించింది కూడా.

You might also like

Leave A Reply

Your email address will not be published.