FbTelugu

లెబనాన్ పేలుడులో 78 మంది మృతి

నాలుగువేల మందికి పైగా గాయాలు

ఉగ్రదాడిగా అభివర్ణించిన డొనాల్డ్ ట్రంప్

బీరుట్: లెబనాన్ దేశంలో ఉన్నట్లుండి ఒక్కసారి భారీ పేలుళ్లు సంభవించాయి. రాజధాని నగరం బీరుట్ సమీపంలోని ఓడరేవులో మంగళవారం రాత్రి జరిగిన ఈ పేలుళ్లో 78 మంది చనిపోగా, నాలుగు వేల మందికి పైగా గాయాలయ్యాయి.
టన్నుల కొద్ది అమర్చిన అమ్మోనియం నైట్రేట్ ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. పేలుడు ధాటికి రెండు బహుళ అంతస్తుల భవనాలు నిమిషాల వ్యవధిలో నేలమట్టమయ్యాయి. పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పేలుడు ప్రాంతం నుంచి వెలువడిన విష వాయువులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరికి లోనయ్యారు. పలువురు ఇళ్ల నుంచి బయటకు రాకుండా తలుపులు, కిటికీలు మూసుకున్నారు.

మైనింగ్, ఫర్టిలైజర్ల తయారీకి ఉపయోగించే అమ్మినియం నైట్రైట్ విస్పోటనం జరిగిందని ఆ దేశ ప్రధాని హసన్ దిబ్ ప్రకటించారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ జాతీయ సంతాప దినంగా ప్రకటించినట్లు తెలిపారు. సహాయ, పునరావాస చర్యల కోసం వంద బిలియన్ డాలర్లు విడుదల చేసినట్లు లెబనాన్ అధ్యక్షుడు మిచెల్ ఓన్ తెలిపారు. రెండు వారాలు బీరుట్ ను మిలిటరీకి అప్పగిస్తూ, ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇది ఉగ్రదాడి అని, ప్రమాదం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ప్రపంచ దేశాల అధినేతలు ఈ దుర్ఘటనను తీవ్రంగా ఖండించారు.

You might also like