FbTelugu

దాడులు పునరావృతం కాకూడదు: చినజీయర్ స్వామి

విజయవాడ: రాష్ట్రంలో దేవాలయాలపై, దేవుళ్ల విగ్రహాలపై వరుస దాడులు జరుగుతున్నాయని దాడులు పునరావృతం కాకుండా చూడాలని ప్రముఖ అధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రంలో 50కి పైగా ఇలాంటి సంఘటనలే జరిగాయన్నారు. సింగరాయకొండపై వెలసిన నరసింహస్వామి వారి చేతులను ఇవాళ ద్వంసం చేశారన్నారు.

ఎవరు చేస్తున్నారనేది అటుంచితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ధర్మ జాగరణ చేసే పెద్దలను కలిసి ఏం చేయాలో ఆలోచిస్తామన్నారు. రక్షణ కోసం కెమెరాలు పెట్టాలనే ఆదేశాలున్నా అమలు కావడం లేదన్నారు. జరిగిన సంఘటనలకు ఉపశమనం కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు.
ధనుర్మాస ఉత్సవాల అనంతరం 17 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయనున్నట్టు తెలిపారు. ఆలయాల ఉనికికే భంగం కలిగించే స్థితి వచ్చిన నేపథ్యంలో తాము మౌనంగా ఉండలేమని తేల్చి చెప్పారు. ఇంటెలిజెన్స్ విభాగంతో సమర్థమైన కమిటీ వేసి విచారణ జరపాలన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.