FbTelugu

చేతులెత్తేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పలు ప్రైవేటు హాస్పిటళ్లలో ఆక్సిజన్ లభ్యత లేక డాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఆక్సిజన్ కొరత పట్టిపీడిస్తున్నందున కరోనా రోగులను చేర్చుకోలేమంటూ ప్రముఖ హాస్పిటళ్లు ట్వీట్ చేశాయి.

ఈ ప్రకటనతో ఢిల్లీ ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఆక్సిజన్ సరఫరా సరిపడినంతగా ఉంటే తప్ప మేము కొత్తగా ఎవరినీ చేర్చుకోమంటూ, ఈ విషయాన్ని తెలిపేందుకు చింతిస్తున్నట్లు మ్యాక్స్ హాస్పిటల్ యాజమాన్యం ప్రకటించింది. తమ వద్ద ఉన్న ఆక్సిజన్ కేవలం రెండు గంటలు మాత్రమే సరిపోతుందని, అందుకే ఎవరినీ చేర్చుకోవడం లేదన్నారు.

గంగారామ్ హాస్పిటల్ యాజమాన్యం కూడా కూడా ఇదే విధమైన ప్రకటన చేసింది. గడచిన 24 గంటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 25 మంది చనిపోయారని ఇవాళ ఉదయం ప్రకటించింది. మరో 60 మంది రోగులు ప్రమాదకర స్థితిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేసింది. 60 మంది రోగులు ప్రమాదకర స్థితిలో ఉన్నారని, ఈలోపు రెండు గంటల తరువాత ఆక్సిజన్ ట్యాంకర్లు చేరుకోవడంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారం అయ్యింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.