FbTelugu

వ్యాక్సిన్ డోసు… కరోనాతో ఒక్కరూ చనిపోలేదు!

న్యూఢిల్లీ: ప్రముఖ హాస్పిటల్ ఏయిమ్స్ కరోనా వ్యాక్సినేషన్ పై కీలక ప్రకటన చేసింది. కరోనా వైరస్ ను నియంత్రించేందుకు సింగిల్ డోసు లేదా డబుల్ డోసు వేసుకున్నవారికి చావు ముప్పు తప్పిందని ఏయిమ్స్ తేల్చి చెప్పింది.
గత ఏప్రిల్, మే నెలల్లో కరోనా కరోనా సోకిన వారిపై ఏయిమ్స్ అధ్యయనం నిర్వహించింది. సెకండ్ వేవ్ దేశంలో ఉధృతంగా ఉణ్న సమయంలో వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వైరస్ సోకిన వారి నుంచి నమూనాలు సేకరించారు. ఈ నమూనాలపై జీనోమిక్ సీక్వెన్స్ స్టడీ నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వైరస్ ప్రభావం అధికంగా ఉన్నా ఎవరు కూడా చనిపోలేదని అధ్యయనంలో వెల్లడైంది.

వ్యాక్సిన్ వేసుకున్న తరువాత పాజిటివ్ వస్తే దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ గా పిలుస్తున్నారు. మొత్తం 63 మందికి వైరస్ సోకగా, 36 మంది రెండు డోసులు, 27 మంది ఒక్క డోసు మాత్రమే తీసుకున్నారు. వీరిలో 10 మంది కోవిషీల్డ్, 53 మంది కోవాగ్జిన్ తీసుకున్నారు. అయితే వీరిలో ఒక్కరికి కూడా ప్రాణాపాయం రాలేదు. పాజిటివ్ వచ్చిన తరువాత అందరూ ఐదు నుంచి ఏడు రోజుల వరకు జ్వరంతో ఇబ్బందులు పడ్డారు. ఈ 63 మందిలో 21 నుంచి 92ఏళ్ల మధ్య వయసువారు ఉన్నారు. వీరిలో ఆరుగురికి వ్యాధి రావడానికి నెల రోజుల ముందే యాంటీబాడీలు వృద్ధి చెందగా, నలుగురిలో పాజిటివ్ తరువాత యాంటీబాడీలు వృద్ధి చెందడం విశేషం.

You might also like

Leave A Reply

Your email address will not be published.