FbTelugu

రత్నప్రభ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి: బాబూ మోహన్

గుంటూరు: తిరుపతి ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కె.రత్న ప్రభ ను ఎంపీగా గెలిస్తే కేంద్ర మంత్రి పదవి వస్తుందని బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ అన్నారు. ప్రజలు బీజేపీ అబ్యర్థి కె.రత్న ప్రభ కే ఓటు వేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నాగార్జున సాగర్ లోని విజయపురిసౌత్ లో బీజేపీ నేత, ప్రముఖ సినీ నటుడు బాబూమోహన్ పర్యటించారు. బీజేపీని గెలిపిస్తేనే తిరుపతి అభివృద్ధి చెందుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేశారని, ఐఏఎస్ గా బడుగు, బలహీన వర్గాలకు సేవలందించారన్నారు. వైసిపికి ఓటేస్తే అభివృద్ధి ఉండదని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి రవి నాయక్ కు ఓట్లు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.