FbTelugu

మజ్లిస్ నాయకుల మందు… చిందు…!

హైదరాబాద్: విందు, వినోదం, చిందు, మందు ఏ పార్టీ సొత్తు కాదు. మతవాద పార్టీలకు ఏమాత్రం మినహాయింపు కూడా కాదు. మజ్లిస్ పార్టీకి చెందిన నాయకులు మందు తాగుతూ, కాల్ గర్ల్స్ తో చిందేస్తూ కెమెరాకు దొరికిపోయారు.

ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాతబస్తీ బండ్లగూడ లేక్ వ్యూ హిల్స్ లో గల ఇంపీరియల్ ఫామ్ హౌస్ లో మజ్లిస్ నాయకుడు ఇచ్చిన విందులో స్నేహితులు మద్యం మస్తుగా సేవించి కాల్ గర్ల్స్ తో డ్యాన్స్ చేశారు. ఇవాళ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పార్టీ ఇచ్చిన పర్వేజ్ పై చాంద్రాయణగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాల్ గర్ల్స్ ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్లా లేక ఇతర రాష్ట్రాల వాళ్లా అనేది విచారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఏది ఏమైనా ఈ వీడియోలు బయటకు రావడంతో పాతబస్తీలో చర్చనీయాంశంగా మారింది. సిద్ధాంతాల పార్టీ అని, మందు, మగువలకు దూరం అని చెప్పుకునే మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ ఏం సమాధానం చెప్పుకుంటారో చూడాలి.

You might also like

Leave A Reply

Your email address will not be published.