FbTelugu

నగ్నంగా కోర్టు ఎదుట న్యాయవాది నిరసన

చెన్నై: కరోనా కష్టకాలంలో ఉపాధి కోల్పోయిన తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలంటూ ఓ న్యాయవాది కోర్టు ఎదుట నగ్నంగా తన నిరసన తెలిపిన ఘటన తమిళనాడులోని విరుదునగర్ జిల్లా సాత్తూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మణికంఠన్ అనే వ్యక్తి సాత్తూరులోని ఉమ్మడి కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నాడు.

కాగా కరోనా లాక్ డౌన్ కారణంగా కోర్టులను కూడా కొన్ని నెలలుగా మూసివేయడంతో ఉపాధి కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో ఏం చేయాలో దిక్కుతోచక ఇలా అర్ధనగ్నంగా నిరసన చేపట్టినట్టు తెలిపాడు. సమాచారం అందుకున్న అధికారులు అతనికి నచ్చజెప్పి అతన్ని ఆదుకుంటామని చెప్పి తీసుకెళ్లారు.

You might also like