FbTelugu

న్యాయవాది నిరంజన్ రెడ్డి ఫీజు రూ.96 లక్షలా?

అమరావతి: న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లించేందుకు పరిపాలనా అనుమతి ఇస్తూ ఈ ఏడాది మే 24న ప్రభుత్వం జారీ చేసిన జిఒ 239ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది.
ఏపీ న్యాయవాదుల రుసుముల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఆ జిఒ ఉందని న్యాయవాది చింతల విజయ్‌కుమార్‌ తరఫున న్యాయవాది వై.కమలారాణి పిటీషన్ వేశారు. ఆ జిఓ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి, కొట్టేయాలని కోరారు. మున్సిపల్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(ఏఎంఆర్డీఏ), అడ్వకేట్‌ జనరల్‌తో పాటు సీనియర్‌ న్యాయవాది ఎస్‌.నిరంజన్‌రెడ్డి లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. అమరావతి రాజధాని తరలింపుపై రైతులు దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌, హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ వ్యాజ్యాల్లో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినందుకు సీనియర్‌ న్యాయవాది రుసుము కింద రూ.96 లక్షలు చెల్లింపునకు జిఒ ఇచ్చారన్నారు.

హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ విచారణకు సీనియర్‌ న్యాయవాది నిరంజన్‌రెడ్డి హాజరు కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. తక్కువ రుసుముకు రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.