FbTelugu

పెద్దపల్లిలో గజ ఈతగాళ్లు

పెద్దపల్లి: లాయర్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసులో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వారి హత్యకు ఉపయోగించిన కత్తులు, మొబైల్ ఫోన్లను సుందిళ్ల బ్యారేజీలో పడేశారు.

వీటిని రికవరీ చ సేందుకు పోలీసులు విశాఖపట్నం నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. హత్యకు ఉపయోగించిన వాటిని ఎక్కడ పడేశారని తెలుసుకునేందుకు నిందితులు కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ లను సుందిళ్ల బ్యారేజీ వద్దకు తీసుకువెళ్లారు. ఎక్కడ పడేసింది వారు చెప్పారు. అవి పడేసి పది రోజులు కావడంతో లభ్యం అవుతాయా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే వాటిని తీస్తే తప్ప కేసుకు ఆధారం లభించదని పోలీసులు అంటున్నారు. గజ ఈతగాళ్లతో రెండు మూడు రోజులు వెతికించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.