FbTelugu

దేశంలోనే ఎత్తైన వాతావరణ కేంద్రం ప్రారంభం

లద్దాఖ్: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్ లో దేశంలో అతి ఎత్తైన వాతావరణ కేంద్రం ను కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ప్రారంభించారు. విపత్తు నిర్వహణ, రక్షణ సిబ్బంది ట్రాఫిక్ కదలికలు, రహదారులు, వ్యవసాయం కోసం ఈ కేంద్రం ప్రత్యేక వాతావరణ సూచనలు అందించనున్నది.

హిమాలయ పర్వతాల కేంద్రంగా ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ ఈటా నగర్ లో ప్రత్యేక వాతావరణ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చిన భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఇవాళ లద్దాఖ్ లో మరో కేంద్రం ప్రారంభించింది. సరిహద్దు ప్రాంతం లద్దాఖ్ లో తరచూ వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది స్థానిక ప్రజల జనజీవనంపై ప్రభావం చూపిస్తుంది. దేశ భద్రత, భౌగోళిక పరిస్థితులను కోసం ఈ కేంద్రాన్ని లేహ్ సముద్ర మట్టానికి 3500 మీటర్ల ఎత్తులో ప్రారంభించినట్లు మంత్రి హర్షవర్థన్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.