FbTelugu

పాట్నాలో రైతులపై లాఠీఛార్జి

పాట్నా: ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా పాట్నాలో ర్యాలీ నిర్వహించిన కిసాన్ మహసభ, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు.
రాజ్‌భవన్‌ను ముట్టడించేందుకు వచ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో కొట్టారు. గాంధీ మైదానం నుంచి రాజ్ భవన్ వైపు వచ్చిన కార్యకర్తలను డాక్‌బంగ్లా కూడలి వద్ద పోలీసులు నిలిపివేశారు. అయినా ఆగుకుండా బారికేడ్ లను విరిచేసి ముందుకు పోయే ప్రయత్నం చేయడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పక తప్పలేదు.

ర్యాలీ గాంధీ మైదానం 10వ నంబర్ గేట్ నుంచి నిలుపుదల చేస్తామని తొలుత ఆలిండియా కిసాన్ మహాసభ హామీ ఇచ్చింది. అయినప్పటికీ, పలువురు కార్యకర్తలు ఆగ్రహంతో 6 వ నంబరు గేటు తాళాన్ని పగలగొట్టి పోస్ట్ బంగ్లా వైపు కదిలారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి రైతు మద్దతుదారులను చెదరగొట్టారు. కదలకపోవడంతో పోలీసులు లాఠీచార్జీ చేసి నిరసనకారులను పరుగులు పెట్టించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.