FbTelugu

రైతులపై లాఠీఛార్జీ, బాష్పవాయువు…

చండీఘడ్: రైతులు తలపెట్టిన ఛలో ఢిల్లీ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్, కేరళ రైతులు ర్యాలీగా ఢిల్లీకి బయలుదేరారు.
అంబాలా-పాటియాలా ప్రాంతంలో హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. వేలాది మందిగా తరలివస్తున్న రైతులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి బారికేడ్లను, ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. రైతులు ఏమాత్రం భయపడకుండా అడ్డంగా ఉన్న బారికేడ్లను, ముళ్ల కంచెను తొలగించి పక్కనే ఉన్న భూములలో పడేశారు. ముందుకు వెళ్లనీయకపోవడంతో రైతులు రాళ్లు చేతబుచ్చుకుని పోలీసుల మీదకి విసిరారు.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు వాటర్ కేనాన్లతో పాటు బాష్పవాయువు ప్రయోగించారు. మొత్తానికి ఈ ప్రాంతం రణరంగంగా మారింది. ముందు జాగ్రత్తగా హర్యానా బీజేపీ ప్రభుత్వం పంజాబ్ కు వెళ్లే బస్సు సర్వీసులు రద్దు చేసి, సరిహద్దులను మూసివేసింది. ఛలో ఢిల్లీ విజయవంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా సీఎం ను ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.