FbTelugu

ట్విటర్ కు లాస్ట్ వార్నింగ్…

న్యూఢిల్లీ: నూతన డిజిటల్ నిబంధనల ప్రకారం భారత్ లో ట్విటర్ అప్పీల్, ఫిర్యాదు అధికారులను నియమించకపోవడంపై కేంద్రప ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి హెచ్చరక అని, వెంటనే వారిని నియమించాలంటూ నోటీసులు జారీచేసింది.

లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కేంద్ర ప్రభుత్వం నోటీసుల్లో వెల్లడించింది. సోషల్ మీడియా, ఆన్ లైన్ మాధ్యమాల్లో వార్తలు, ప్రకటనల షేరింగ్ పై నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ నిబంధనలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నిబంధనల అమలు కోసం ఇచ్చిన గడువు ముగియడంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. నూతన విధానాల ప్రకారం చీఫ్ కంప్లియిన్స్ ఆపీసర్, ఆ తరువాతి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రెసిడెంట్ గ్రీవెన్స్ ఆఫీసు, నోడల్ కాంటాక్ట్ ఆఫీసర్ ను ఇంకా నియమించకపోవడంతో కేంద్రం మండిపడుతున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం ఇవాళ చివరి నోటీసు జారీ చేసింది. ఒకవేళ ఉల్లంఘిస్తే మధ్యవర్తిత్వ హోదాను కోల్పోవడమే కాకుండా, ఆ తరువాత చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవల్సి ఉంటుందిని హెచ్చరించింది. తాజాగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యక్తిగత ట్విటర్ ఖాతాకు వెరిఫైడ్ బ్లూ టిక్ మార్క్ ను కొద్ది గంటల పాటు తొలగించింది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడం, ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో తిరిగి టిక్ మార్క్ ఇచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్రం ట్విటర్ పై మరింత దూకుడు పెంచి చివరి అస్త్రాన్ని ప్రయోగించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.