FbTelugu

రాజస్థాన్ చివరి రాజు హఠాన్మరణం

జోధ్ పూర్: జైసల్మేర్ చివరి మహారాజు బ్రజరాజ్ సింగ్ (52) హఠాన్మరణం చెందారు. ఢిల్లీలోని మేదాంత హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.

మహారాజు మరణంతో జైసల్మేర్ ప్రాంతం శోకసంద్రంగా మారింది. ఆయన మరణానికి నివాళిగా అన్నీ మూతపడ్డాయి. చారిత్రక సోనార్ కోటపై రాజ కుటుంబం జెండాను అవనతం చేశారు. ఇవాళ అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. 1968 నవంబర్ 31న జైసల్మేర్ లో బ్రజరాజ్ సింగ్ జన్మించారు. 1993 జనవరిలో నేపాల్ కు చెందిన మహారాజా సహదేవ షంషర్ జంగ్ బహదూర్ కుమార్తె రాజేశ్వరీ దేవిని పెళ్లి చేసుకున్నారు.
ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కున్వర్ చేతన్రాజ్ సింగ్ భాటీ, జనమేజ్యరాజ్ సింగ్ భాటీ ఉన్నారు. గురువారం తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో జోధ్ పూర్ నుంచి ఏయిర్ అంబూలెన్స్ లో ఢిల్లీలోని మేదాంత స్పిటల్ కు తరలించారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఆయనకు మార్పిడి చేయించుకోవాలని గతంలో వైద్యులు సూచించారు. తీవ్ర కడుపు నొప్పి రావడంతో బ్రజరాజ్ సింగ్ సోమవారం రాత్రి పొద్దుపోయిన తరువాత మరణించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.