FbTelugu

చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన లారీ

సిద్దిపేట: అందరూ చూస్తుండగానే ఓ లారీ వరదలో కొట్టుకుపోయిన ఘటన జిల్లాలోని బస్వాపూర్ బ్రిడ్జి వద్ద పెద్ద వాగులో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక పెదవాగు బస్వాపూర్ బ్రిడ్జిపైనుంచి ఉధృతంగా 2 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది.

ఈ క్రమంలో అటుగా వెళ్లిన ఓ లారీ వరద ఉధృతికి వాగులో కొట్టుకు పోయింది. మధ్యలో ఉన్న ఓ చెట్టును పట్టుకొని డ్రైవర్ ప్రాణాలను దక్కించుకున్నాడు. సమాచారం అందుకున్న మంత్రి హరీష్ రావు వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, వరంగల్ నుంచి ప్రత్యేక రెస్క్యూ బృందాలు బయలుదేరాయి.

You might also like