FbTelugu

హెవీలోడ్ తో దుకాణాల్లోకి దూసుకెళ్లిన లారీ

చిత్తూరు: హెవీ లోడ్ తో వచ్చిన ఓ లారీ బీభత్సం సృష్టించి దుకాణాల్లోకి దూసుకెళ్లిన ఘటన జిల్లాలోని గంగాధరనెల్లూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక గంగాధరనెల్లూరులో అధిక లోడ్ తో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి పక్కనే ఉన్న దుకాణాలపైకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని లారీని సీజ్ చేశారు. డ్రైవర్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.