FbTelugu

ఏడుగురి ప్రాణాలను బలిగొన్న లారీ

పాట్నా: రెండు ఆటోలను ఓ లారీ బలంగా ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెంది, 12 మందికి తీవ్ర గాయాలైన దారుణ ఘటన బీహార్ లోని విష్ణుపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన ఓ లారీ రెండు ఆటోలను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like