FbTelugu

ఇద్దరు కూలీలను బలిగొన్న లారీ ప్రమాదం

రంగారెడ్డి: లారీ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందిన ఘటన జిల్లాలోని హయత్‌నగర్‌ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భిక్షపతి, సుదర్శన్‌ అనే ఇద్దరు కూలీలు హయత్ నగర్ లోని స్థానిక వర్డ్‌ అండ్‌ డీడ్‌ పాఠశాల సమీపంలో రోడ్డు దాటుతుండగా..

వేగంగా వచ్చిన ఓ లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈఘటనలో కూలీలిద్దరూ అక్కడే ప్రాణాలొదిలారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.