FbTelugu

డ్రైవర్ ను బలిగొన్న నిర్లక్ష్యం

కృష్ణా: నందిగామ పాత కాకతీయ రెస్టారెంట్ వద్ద జాతీయ రహదారి పై లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు ఒకరు మృతి చెందారు.
అదుపుతప్పుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు డ్రైవరు, క్లీనరు లారీ నుండి కిందకు దూకేశారు. ప్రమాదం జరిగిన పరిస్థితిని లారీ డ్రైవర్ ప్రక్కకు నిలబడి చూస్తుండగా మరో డీసీఎం కంటైనర్ వ్యాను బోల్తాపడింది.

వ్యాన్ లారీని ఢీ కొనడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురికి అతి స్వల్ప గాయాలయ్యాయి. రెండు వాహనాల మధ్య లో చిక్కుకున్న లారీ డ్రైవర్ మృతదేహాన్ని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదానికి జాతీయ రహదారి విస్తరణ పనులు జరగకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. రహదారిపై భారీగా మట్టి కుప్పలు ఉండటంతో లారీ బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.