FbTelugu

అమెరికాలో కుప్పకూలిన భారీ భవనం

ఫ్లోరిడా: ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో గురువారం తెల్లవారు జమున భారీ ప్రమాదం చోటు చేసుకున్నది. పెన్నెండు అంతస్తుల భవనంలో కొంతభాగం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు చనిపోగా, ఇంకా ఎంత మంది చిక్కుకున్నారనేది తెలియడం లేదు.
ఘటన జరిగిన తరువాత ఇప్పటి వరకు 102 మంది ని కాపాడినట్లు మియామి డెడ్ కౌంటీ మేయర్ డానియెల్ లెవైన్ కావా తెలిపారు.

మరో వంద మంది వరకు శిథిలాల కింద చిక్కకుని ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. భవన శిథిలాల కింద చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ భవనంలో మొంత్తం 139 గదులు ఉండగా, 55 గదులు కూలినట్లు సమాచారం. కేవలం అర నిమిషం వ్యవధిలో మొత్తం కూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.