FbTelugu

తుమ్మల చెరువు దగ్గర పెద్దపులి కలకలం

భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణలో గత కొన్ని రోజులుగా.. పెద్దపులుల, చిరుతల గాండ్రింపులు ఎక్కువైనాయి. పులులు జనావాసాల్లోకి వస్తూ ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా జిల్లాలోని తుమ్మల చెరువు దగ్గర ఓ పెద్ద పులి తీవ్ర కలకలం సృష్టించింది.

ఓ ఆవును చంపి లాక్కెళ్లింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయినాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పులి జాడను కనిపెట్టే పనిలో అధికారులు పడ్డారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.