FbTelugu

సన్యాసులకు పెద్ద ఎత్తున పాజిటివ్

గ్యాంగ్ టక్: బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటున్న సన్యాసులను కూడా కరోనా వైరస్ వదిలిపెట్టడం లేదు. 37 మంది బౌద్ధ సన్యాసులకు పాజిటివ్ నిర్థారణ కావడంతో వారిని ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు.

సిక్కింలోని గ్యాంగ్ టక్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో రుమ్టెక్ ఆశ్రమంలో ధర్మచక్ర కేంద్ర ఉంది. ఇక్కడ ఉన్న 61 మంది సన్యాసులను పరీక్షించగా 37 మందికి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఎక్కువ కేసులు నమోదుకావడంతో గుంజాంగ్ మోనాస్టరీ ని కంటైన్ మెంట్ జోన్ గా అధికారులు ప్రకటించారు. వైరస్ సోకిన 31 మంది సన్యాసులను సరంసా గార్డెన్ ఐసోలేషన్ కేంద్రానికి తరలించారు. గ్యాంగ్ టక్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రాబిన్ మాట్లాడుతూ, రుమ్టెక్ ఆశ్రమంలో కదలికలను పరిమితం చేసినట్లు ప్రకటించారు. వీరి ద్వారా ఇంకా ఎంత మందికి సోకిందనే దానిపై కాంటాక్టులను గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ఉన్నారన్నారు. కరోనా కేసులు ఏమాత్రం తగ్గకపోవడంతో మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.