FbTelugu

ఢీకొన్న రైళ్లు… పెద్ద సంఖ్యలో మృతి

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో ఎదురెదురుగా వచ్చిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ముప్పై మంది ఘటనా స్థలంలో చనిపోగా, భారీ సంఖ్యలో ప్రయాణీకులు గాయపడ్డారు.

సోమవారం తెల్లవారు జామున రేతి-దహర్కి రైల్వే స్టేషన్ల మధ్య మిల్ట్ ఎక్స్ ప్రెస్, సయ్యద్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఒకదానికొటి బలంగా ఢీకొట్టుకున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో అందరూ నిద్రమత్తులో ఉన్నారని, దీంతో పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారని ఘోట్క్కి జిల్లా పోలీసు అధికారి ఉస్మాన అబ్దుల్లా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వై అధికారులు ఈ రూట్లో రైళ్ల రాకపోకలు నిలిపివేశారు. హుటాహుటిన రైల్వే అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతం హాహాకారాలు, రోదనలతో నిండిపోయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.