FbTelugu

బైక్ పైకి దూసుకొచ్చిన పెద్దపులి

కొమురంభీం: ఓ పులి బైక్ పైకి దూసుకురావడంతో బైక్ పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్ర గాయాలపాలైన ఘటన జిల్లాలోని బెజ్జూరు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. బెజ్జూరు-కమ్మర్ గామ్ వెళ్లే మార్గంలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై వెళుతుండగా.. ఒక్కసారిగా ఓ పెద్ద పులి బైక్ వైపుగా దూసుకు రావడంతో ఒక్కసారిగా కింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలైనాయి. కాగా పెద్దపులి సంచరిస్తుందన్న వార్తతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు.

You might also like