FbTelugu

పెంబర్తిలో లంకె బిందె

జనగామ: పెంబర్తి గ్రామంలో ఒక వ్యక్తి తన భూమిలో తవ్వుతుండగా బంగారం బిందె లభ్యమైంది. ఈ విషయాన్ని వెంటనే రెవెన్యూ, పోలీసు అధికారులకు తెలియచేశాడు.
పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే పక్కన పెంబర్తి గ్రామంలో నర్సింహ అనే వ్యక్తి 11 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు.

ఆ భూమిలో పూజ చేసి జెసిబితో చదును చేస్తుండగా లంకె బిందె కన్పించింది. వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడకు చేరుకున్నారు. అందుటో 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. ఈ విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, గ్రామ సర్పంచి ఘటనా స్థలాన్ని సందర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.