FbTelugu

ఆపిల్ మార్కెట్ యార్డ్ పై కొండచరియలు

సిమ్లా: ఆపిల్ మార్కెట్ యార్డ్ పై కొండచరియలు విరిగిపడి నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన సిమ్లాలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే కొండచరియలు విరిగిపడ్డ సమయంలో మార్కెట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్టైంది. కాగా కొద్ది రోజుల పాటూ.. మార్కెట్ ను మూసివేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఆపిల్ సీజన్ లోనే మార్కెట్ బంద్ కావడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు.

You might also like