FbTelugu

కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి

ఖాట్మండు: కొండచరియలు విరిగిపడి 10 మంది మృతి చెందిన ఘటన నేపాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. గత కొన్ని రోజులుగా నేపాల్ లో కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి.

ఈ తరుణంలోనే ఇవాళ నేపాల్ లో కొండచరియలు విరిగిపడడంతో అక్కడే ఉన్న ప్రజలపైకి దూసుకురావడంతో కొండచరియల కింద పడి 10 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలైనాయి. చనిపోయిన వారిలో ఓ భారతీయుడు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

You might also like