FbTelugu

ఆగస్టు 1 నుంచి భూముల విలువ పెంపు?

హైదరాబాద్: ఆదాయ వనరులు మృగ్యం కావడం, కరోనా కాలంలో పన్నుల రాబడి పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పై ఫోకస్ పెట్టింది. ఫ్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యాయి. ఇందుకు అనుగుణంగా పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం విచ్చలవిడిగా సాగుతున్నది. గ్రామ పంచాయతీ లే అవుట్ పేరుతో ప్లాట్ల విక్రయం జరుగుతోంది. ఎక్కడ కూడా డిటిసిపి, మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేకుండా లేఅవుట్లు వేస్తున్నారు. గత ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వా ఖజానాకు నిధుల లభ్యత తగ్గింది. పన్నుల రూపేణా రాబడి తగ్గడంతో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ప్ విభాగం ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకునేందుకు చర్యలు మొదలు పెట్టారు. 2019-20 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.6,299 కోట్ల ఆదాయం సమకూరింది. స్థిరాస్తుల విలువ సవరిస్తే రూ.10వేల కోట్ల వరకు వస్తుందని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీలు వేసి స్థిరాస్తుల విలువ నిర్థారణ చేసి ప్రభుత్వానికి సిఫారసు చేసేవారు. ఈ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వమే భూముల విలువలను సవరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా జాతీయ, రాష్ట్ర, అంతర్ జిల్లా రోడ్లు, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాలను బట్టి విలువలను అమాంతం పెంచనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.