FbTelugu

ఏడాది తిరగకుండానే భూములమ్ముకునే పరిస్థితి : కన్నా

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలన ఏడాది తిరగకుండానే రాష్ట్రంలో భూములు అమ్ముకునే పరిస్థితి దాపురించిందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడుతూ..

ఏపీలో జగన్ అధిక ఛార్జీలు ప్రజలపై ఎక్కువైనాయని అన్నారు. వైసీపీ పాలనపై హైకోర్టు అనేక సార్టు మొట్టికాయలు వేసిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగకుండానే ప్రభుత్వం
దివాలా తీసిందా? అంటూ.. హైకోర్టు ప్రశ్నించిందన్నారు. జగన్ కు న్యాయవ్యవస్థపై, చట్టసభలపై ఏమాత్రం గౌరవం లేదన్నారు.

You might also like