FbTelugu

నిర్మాత కల్యాణ్ పై భూకబ్జా కేసు

హైదరాబాద్: వివాదాస్పద నిర్మాత గా పేరున్న సి.కల్యాణ్ పై బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

యుఎస్ లో వైద్యుడిగా పనిచేస్తున్న ఎన్ఆర్ఐ స్వరూప్ 1985 లో ఫిల్మ్ నగర్ హౌసింగ్ సొసైటీలో ప్లాట్ కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజు కు ఇవ్వగా ఆర్గానిక్ స్టోర్ నడుపుతున్నాడు. సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్ మనుషులం అని చెప్ప ముగ్గురు వ్యక్తులు వచ్చారు. షరీఫ్, శ్రీకాంత్, తేజస్వి కలిసి స్టోర్ కు తాళం వేసి సిబ్బందిని బయటకు గెంటేశారు. ఈ విషయాన్ని స్టోర్ యజమాని నారాయణమూర్తి స్థల యజమానికి స్వరూప్ కు ఫోన్ లో తెలియచేశాడు. హైదరాబాద్ లో ఉన్న స్వరూప్ సోదరుడు నిర్మాత కల్యాణ్ తో పాటు ఇతరులపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.