FbTelugu

విశాఖలో భూముల వేలం

విశాఖపట్టణం: ప్రజాకర్షక పథకాలను నిధులు హారతి కర్పూరంలా అయిపోతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం నిధుల వేటలో పడింది. ‘మిషన్ బిల్డ్ ఏపీ’లో భాగంగా ఆస్తుల విక్రయించేందుకు సన్నాహలు చేసింది.

విశాఖలో అత్యంత విలువైన 18 ప్రభుత్వ భూముల అమ్మకానికి.. ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. బీచ్‌రోడ్డులోని 13.59 ఎకరాల ధర రూ. 1,452 కోట్లుగా నిర్ణయించారు. నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కంపెనీ (ఎన్.బి.సి.సి) వెబ్ సైట్ లో ఆస్తుల సమగ్ర వివరాలను ఇంటర్నెట్‌లో పెట్టారు. ఇందులో బీచ్ రోడ్డులో ఏపీఐఐసీకి చెందిన 13.59 ఎకరాల భూమి సహా మొత్తం 18 ఆస్తులు ఉన్నాయి. అలాగే, బీచ్ రోడ్డు మార్గంలోని భూమి ధరను రూ.1,452 కోట్లుగా ఎన్.బి.సి.సి నిర్ణయించింది.

స్థలాల వివరాలు, వాటి ఫొటోలు, లే అవుట్ కాపీలు, ప్లాట్ నంబర్లు, మ్యాప్‌లు, నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి అవి ఎంత దూరంలో ఉన్నాయి? వంటి పలు వివరాలను అందుబాటులో పెట్టారు. ఈ నెల 22న ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్ ముందస్తు మొత్తం (ఈఎండీ) సమర్పించాలని సూచించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.