FbTelugu

లోన్ యాప్స్ నడుపుతున్న లాంబో అరెస్ట్

న్యూఢిల్లీ : భారత్ లో లోన్ యాప్స్ కేసులో కీలక పురోగతిని పోలీసులు సాధించారు. భారత్ లో లోన్ యాప్స్ నిర్వహస్తున్న చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు.

లాంబో చైనాకు పారిపోయేందుకు యత్నించినట్టుగా పోలీసులు తెలిపారు. లాంబో 4 కంపెనీల ద్వారా లోన్ యాప్స్ నడుపుతున్నట్టు గుర్తించారు. లోన్ యాప్స్ నిర్వహనలో లాంబోకు పూర్తిస్థాయిలో సహకరించిన కర్నూల్‌కు చెందిన నాగరాజును కూడా ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 6 నెలల కాలంలో 150 యాప్స్ ద్వారా సుమారు రూ.21 వేల కోట్ల లావాదేవీలు జరిపినట్టుగా గుర్తించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.