FbTelugu

క్షీణించిన లాలూ ఆరోగ్యం

రాంచీ: మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించిందని ఆయనకు చికిత్స అందిస్తున్న డాక్టర్ ఉమేష్ ప్రసాద్ తెలిపారు. మూత్ర పిండాలు 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయని, ఏ క్షణంలోనైనా క్షీణించే అవకాశాలున్నాయన్నారు.

రాంచిలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లాలూ చికిత్స పొందుతున్నారు. లాలూ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ ఉమేష్ సూపరింటెండెంట్ కు లిఖితపూర్వకంగా తెలియచేశారు. గత రెండు దశాబ్ధాలుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారని, మధుమేహం కారణంగా మరింత దెబ్బతిన్నదన్నారు. మెరుగైన వైద్య సౌకర్యాల కోసం ఆయనను వేరేచోటికి తరలించాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. పశుగ్రాసం కుంభకోణం లో బెయిల్ మంజూరు చేయాలన్న పిటీషన్ ను జార్ఖాండ్ హైకోర్టు వచ్చే నెల జనవరి 22వ తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.