FbTelugu

రూ.10 రీచార్జ్ పేరుతో లక్షలు నొక్కేశారు

హైదరాబాద్: లాక్ డౌన్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు. పేటీఎంలో రూ.10 రీచార్జ్ పేరుతో ఓ ఆఫర్ ఇచ్చి లక్షలు కొట్టేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. కొందరు సైబర్ నేరగాళ్లు పేటీఎంలో రూ.10 రిచార్జ్ పేరుతో ఓ ఆఫర్ ఇచ్చారు.

దీంతో రిచార్జ్ చేసుకున్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుని పేటిఎం అకౌంటును హ్యాక్ చేశారు. అతని అకౌంటు నుంచి ఏకంగా లక్ష రూపాయలు నొక్కేశారు. దీంతో బాధితుడు మోసపోయానని గుర్తించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన మరుసటి రోజే మరొకరి నుంచి లక్ష రూపాయలు కాజేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like