FbTelugu

నెలకు లక్ష జీతం.. బిడ్డనిస్తే పెళ్లి చేసుకుంటా!

ముంబయి: నెలకు జీతం రూ.1 లక్ష పైనే వస్తున్నది, బిడ్డను ఇస్తే పెళ్లి చేసుకుంటానంటూ ఒక నెటిజన్ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ భార్య గౌరీకి ఏమోజీ షేర్ చేశాడు.

ఆమె చూసిందో లేదో కాని ఈ ఏమోజీపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నీ లక్ష రూపాయలు వారికి ఏమాత్రం సరిపోవని, రోజు ఖర్చుకు కూడా సరితూగలేవని, నీకు ఆ స్థాయి లేదని పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్, భార్య గౌరి కుమార్తె సుహానా ఖాన్ (మే 25వ తేదీ) 21వ వడిలోకి అడుగుపెట్టింది. కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా గౌరీ ఫొటో షేర్ చేసింది. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తునే ఉంటాం అని కామెంట్ పెట్టింది. వేలాది మంది అభిమానులు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఒక అభిమాని మాత్రం విభిన్నంగా కామెంట్ పెట్టాడు. గౌరీ మేడం… నేను ప్రతినెలా రూ.1 లక్ష పైనే సంపాదిస్తున్నాను, సుహానా ఖాన్ ను తనకిచ్చి పెళ్లిచేయాలని ప్రపోజల్ పెట్టాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.