FbTelugu

ఏపీలో లక్ష కేసులు దాటాయి…

అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు ఒక లక్ష దాటాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఇవాళ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
ఏపీలో రికార్డు స్ధాయిలో కరోనా పాజిటవ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ తర్వాత లక్ష కేసులు నమోదు చేసిన రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6051 కరోనా పాజిటివ్ కేసులు రాగా 49 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 102349 కు చేరుకున్నది. గత 24 గంటల్లో మొత్తం 43127 నమూనాలు పరీక్షించారు. ఇప్పటివరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1090.

తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు అత్యధికంగా 1,210 కేసులు నమోదయ్యాయి. గుంటూరు లో 744 మందికి, కర్నూలులో 664, విశాఖపట్నంలో 655, అనంతపురంలో 524, నెల్లూరులో 422, పశ్చిమగోదావరిలో 408, చిత్తూరులో 367, కడపలో 336, ప్రకాశంలో 317, విజయనగరంలో 157, శ్రీకాకుళం జిల్లాలో 120 కేసులు నమోదు అయినట్లు బులెటిన్ లో పేర్కొన్నారు.

పశ్చిమగోదావరి కరోనా కేసులు తగ్గినప్పటికీ మరణాలు ఈ రోజు పెరిగాయి. పశ్చిమగోదావరిలో 9మంది, విశాఖపట్నంలో 8మంది, చిత్తూరులో 7గురు, తూర్పుగోదావరిలో 7గురు, కృష్ణాలో 5గురు, విజయనగరంలో 4గురు, అనంతపురం లో ముగ్గురు, కర్నూలు, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున, కడప, ప్రకాశం జిల్లాల్లో ఒక్కరు చొప్పున మరణించారు.

You might also like