FbTelugu

లేడీ చీటింగ్… 11 కోట్లు ఇచ్చిన వీరారెడ్డి

హైదరాబాద్‌: ఒక మహిళ ముగ్గురు వ్యక్తుల సాయంతో ఒకరిని బ్లాక్ మెయిల్ చేసి రూ.11 కోట్ల వరకు వసూలు చేసింది. నకిలీ ఐపీఎస్ అధికారి అవతారమెత్తి డబ్బులు వసూలు చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పోలీసులు చెప్పేది మాత్రం మరో రకంగా ఉంది.
పోలీసుల కథనం ప్రకారం.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విలాసాలకు అలవాటు పడిన ఓ సాధారణ మహిళ స్మృతి సింహ తాను “ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ చైర్మెన్ సౌత్ ఇండియా” అని పలువురు ప్రముఖులను పరిచయం చేసుకుంటిం. డబ్బు ఉన్న వారిని గుర్తించి వారితో సన్నిహితంగా మెలుగుతుంది. తన ముగ్గురు అనుచరులు రాఘవరెడ్డి, రణధీర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డిలతో కలిసి బాచుపల్లిలో నివాసం ఉండే వీరారెడ్డి(36) అనే వ్యాపారి నుంచి రూ.11 కోట్ల వరకు గుంజింది. పలు అంశాల్లో వీరారెడ్డిని బ్లాక్ మెయిల్ చేసేది. అదే పనిగా డబ్బులు అడుగుతుండడంతో విసిగివేసారిన వీరారెడ్డి బాచుపల్లి పోలీసు స్టేషన్ లో ఈనెల 12న స్మృతి సింహ పై ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న బాచుపల్లి పోలీసులు నింధితులపై నిఘాపెట్టి నేడు స్మృతి సింహను అరెస్టు చేశారు.

ఆమెకు సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులు రాఘవ రెడ్డి, రణధీర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీరి వద్ద నుండి సుమారు రూ.6 కోట్ల మేర ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 50 లక్షలు విలువ చేసే బంగారు/ వెండి నగలు, 7మొబైల్ ఫోన్స్, 2లక్షల నగదు, క్రెడిట్ /డెబిట్ కార్డులు, ఖరీదైన 5కార్లు( 3 బీఎండబ్ల్యూ, 2 ఫోర్డు క ర్లు) , ఒక విల్లాను స్వాధీన చేసుకున్నారు. వీరి గ్యాంగ్ లో ఉండే మరో వ్యక్తి అంకిరెడ్డి విజయకుమార్ రెడ్డి తాను ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాయని చెప్పుకొని బ్లాక్ మేయిల్ చేస్తుంటాడు. ప్రస్తుతానికి ఇతను పరరారీలో ఉన్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.