FbTelugu

ఆసుపత్రుల్లో మంచాల కొరత…!

నాగపూర్: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోవడంతో ఆసుపత్రులలో మంచాల కొరత మొదలైంది. నాగపూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. కరోనా రోగులు పడకలకోసం నానా అగచాట్లు పడుతున్నారు.

ఒకే మంచంపై ఇద్దరు, ముగ్గురు చొప్పున రోగులకు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి బెడ్డుపై కనీసం ఇద్దరు చికిత్స తీసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే లక్షలకు లక్షలు పోయాల్సి వస్తుందని పలువురు ప్రభుత్వం బాట పడుతున్నారు. నాగపూర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి కరోనా రోగులతో కిటకిటలాడుతున్నది. రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో మంచాల సంఖ్యను పెంచినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ అవినాశ్ గవాండే చెప్పినప్పటికీ వాస్తవ పరిస్తితి మాత్రం భిన్నంగా ఉంది.

నాగపూర్ లో సోమవారం నాడు మూడు వేల మందికి పైగా కరోనా సోకగా, 55 మంది ప్రాణాలు కోల్పోయారు. కొద్ది రోజులుగా నాగపూర్ లో రాత్రిపూట లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలు పాటించాలని వైద్యులు కోరుతున్నారు. పరిస్థితి విషమించిన తరువాత రావడంతో ఆసుపత్రుల్లో రద్దీ పెరిగి మంచాలు, ఆక్సిజన్ సిలిండర్లు లభ్యం కావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. గతేడాది కరోనా ప్రారంభ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.